అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో అగ్రిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగులబడి పొలాలకు మంటలను వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు అలుముకోవడంతో సీఎం నివాసం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఫణి తుఫాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సీఎం చంద్రబాబుకు కాల్ చేసిన తుఫాన్ గురించి ఆరాతీశారు.