భద్రత బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.84,560 కోట్ల వ్యయంతో సముద్ర నిఘా, మల్టీ-మిషన్ విమానాలు, కొత్తతరం యాంటీ ట్యాంక్ మైన్స్ తదితర ఆయుధ వ్యవస్థలు సమకూర్చేందుకు పచ్చజెండా ఊపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (DAC).. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.