రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేయండి – బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్రమోహన్

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’ బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు  జక్కా చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బిసి రక్షక్ దళ్ ఏర్పాటు చేసిన సమావేశంలో  జక్కా చంద్రమోహన్ మాట్లాడుతూ

పేద విద్యార్థులు అప్పులుచేసి ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12శాతం జనాభా ఉన్న మైనారిటీలకు 204 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 15శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 268 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 6శాతం జనాభా ఉన్న ఎస్టీలకు 169 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయని, 52శాతం ఉన్న బీసీలకు 142 మాత్రమే ఉన్నా యన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 890 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ చక్రవర్తి రాకేష్ దిలావర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *