శ్రీశైలం చెర్వుగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రెండో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున నిర్వహించే స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి హాజరయ్యారు.