హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఛలో రాజ్‌భవన్‌కు సీపీఐ పిలుపునిచ్చింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ర్యాలీ నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు గవర్నర్ నరసింహన్ స్పందిచాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వమే విద్యార్థుల హత్యలు చేయించిదని ఆరోపించారు. మంత్రి జగదీష్‌రెడ్డిని తొలగించాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు.