కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన కోడలు జడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు తాము కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ను కలిసి చేరికపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *