హైదరాబాద్: తెలంగాణలో మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకూ అన్ని పార్టీ మద్దతుదారులు జోరుగా ప్రచారం నిర్వహించారు. శనివారం సాయంత్రం 4 గంటలతో ప్రచార సమయం ముగియడంతో అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో నిశ్శబ్ధయుద్ధం మొదలైంది. ఇక సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు ఎంపీటీసీకి వైట్ కలర్, జెడ్పీటీసీకి పింక్ కలర్ పేపర్లను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రి, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్‌లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది, సామాగ్రి తరలింపులో ఇబ్బందులు రాకుండా సమయాన్ని కుదించాలని ఇప్పటికే డీజీపీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.