తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలలో ఎలా ఐతే లోపాలు ఉన్నాయో అదేవిధముగా మన ఆంధ్రప్రదేశ్ లోని కూడా కొన్ని ప్రముఖ యూనివర్సిటీలో అదే విధంగా లోపాలు ఉన్నాయి.
తెలంగాణ లో ఇంటర్మీడియట్ విద్యార్థులు వయసులో తక్కువగా ఉండటం వల్ల మానసిక వత్తిడిని తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీలలో డిగ్రీ, పీజీ, పి.హెచ్.డి స్థాయి విద్యార్థులు పరీక్షల నిర్వహణ మరియు ఫలితాలు వెల్లడి సరైన సమయంలో జరగపోవడం వల్ల మానసికంగా కృంగిపోతున్నారు.
ఆంద్రప్రదేశ్ లోని ఆంధ్రా యూనివర్సిటీలో గతంలో చాలా పకడ్బందీగా క్రమ పద్దతిలో అన్ని విభాగాలు అధికారులు నడిచేవారని పూర్వ విద్యార్థులు తెలియ జేస్తున్నారు. అప్పుడు పనితీరు చాలా ఉన్నతంగా ఉన్నట్లు తెలిసింది. ఐతే గత కొన్ని నెలలుగా అదే ఆంధ్రా యూనివర్సిటీలో కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీలో అధికారికముగా పరీక్షలు నిర్వహించుటకు వరుసగా విడుదల చేసిన పరీక్షలు నోటిఫికేషన్లు పరీక్షించగా!
1). ఈ సంత్సరం జనవరి 2019 లో స్పెషల్ డ్రైవ్ పేరుతో సబ్జెక్ట్ కి 5000/- రూపాయల చోప్పున ఫీజు కట్టించుకున్నారు. కానీ ఇంతవరకు పరీక్షల తేదీనికానీ పరీక్షలుకానీ పేట్టలేదు.
2). అదే జనవరి నెలలో యానువల్ ఎక్సమ్స్ అని ఫీజు కట్టించుకుని పరీక్షలు నిర్వహించారు, కానీ ఫలితాలు ఇంకా వెల్లడిచేయలేదు.
3). మాళ్ళీ ఇప్పుడు కోత్తగా స్పెషల్ ఎక్సమ్స్ పేరుతో 25.4.2019 నోటిఫికేషన్ ఇచ్చి చివర తేదీ 3.5.2019 అని ఒక్కోక్క సబ్జెక్ట్ కి Rs15000/- చెల్లించమంటున్నారు.
ఈ విధంగా డబ్బులు కట్టించుకుని పరీక్షలు నిర్వహించకుండా, ఒక వేళ్ళ నిర్వహించిన ఫలితాలు వెల్లడించకుండా, మళ్ళీ క్రొత్తగా స్పెషల్ ఎక్సమ్స్ పేరుతో డబ్బులు గుంజుతు న్నారు. ఈ విదంగా విద్యార్థులు భవిష్యత్తు తో ఆటలు ఆడుకుంటున్నారు అని ఆంధ్రా యూనివర్సిటీ పై కొందరు గవర్నర్ నరసింహన్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కుంభకోణం మొత్తానికి బయటికి లాగడం కోఱకు CBI మరియు సిట్టింగ్ జడ్జి తో అత్యవసర సర్వే చేయించాలి అని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.
ఈ సమస్యలు బయటకు చెప్తే విద్యార్థులను ఏదో వంకతో సస్పెండ్ చేస్తారేమో అని భయపడుతూ ఉన్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల సమస్య ఏర్పడటానికి ప్రధాన సూత్రధారి గ్లోబరీనా సంస్థ ఆంధ్రాలో కూడా పలు యూనివర్సిటీ లలో భాగస్వామ్యంగా ఉంది. ఈ గ్లోబరీనా వారి వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికి ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యం గా ఉన్న యూనివర్సిటీలు స్పందించడం లేదు.
ప్రభుత్వ కాలేజీలలో ప్రధానంగా వెనకబడిన పేద విద్యార్థులు సగానికిపైగా ఉంటారు. ఐతే వారు పరీక్షలు ఫలితాలు తెలియకుండా ప్రతిసారి డబ్బు కట్టాలి అంటే చాలా సమస్యతో కూడుకున్న పని కుటుంబాలకు భారంగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం లో లాగా ఆంద్రప్రదేశ్ లో ఈ సమస్యకి తక్షణమే పరిష్కారం చెయ్యాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.