చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో వరుసగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు. ఇదే సమయంలో స్కిల్ స్కాంలో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్దన మేరకు ఈ కేసు విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది.

 

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తమ పిటిషన్‌లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో తెలిపింది. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరుతోంది.

 

కాగా జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తిరిగి ఈ రోజు ధర్మానం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ లూథ్రా కొన్ని ఇబ్బందుల కారణంగా హరీష్ సాల్వే ఈ రోజున కోర్టుకు రాలేకపోయారని వివరించారు. మూడు వారాలు వాయిదా వేయాలని అభ్యర్దించారు. దీని పైన స్పందించిన ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ వీలైనంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో, రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న ధర్మానం..తదుపరి విచారణకు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *