నలుగురికి ఆదర్శంగా నిలిచిన కానిస్టేబుల్ రామదాసు మరియు తన నిజాయితీ చాటుకున్న సౌట.దేవేందర్ అభినందించిన అచ్చంపేట ఎస్. ఐ.


నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలో బొళ్లిపోగు లక్ష్మణ్ పలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో అచ్చంపేట పట్టణంలో క్రూజర్ ఎక్కి హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది.అందులో భాగంగా తన యొక్క లగేజ్ ఆ క్రూజర్ పైభాగంలో వేయగా నడింపల్లి ప్రాంతంలో ఆ యొక్క బ్యాగు పడి పోయినది అది గమనించక డ్రైవరు అలాగే ముందుకు వెళ్ళాడు తర్వాత హాజిపూర్ ప్రాంతంలో చూడగా తన బాగు కనిపించకపోయేసరికి అచ్చంపేట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా నడింపల్లి కి చెందిన సౌట దేవేందర్ అను వ్యక్తి ఆ యొక్క బ్యాగును తీసుకెళ్లి నడింపల్లి లో కిరాణా షాప్ దగ్గర పెట్టాడు విచారణలో భాగంగా గా దేవేందర్ అనే వ్యక్తి ఆ బ్యాగును పోలీసువారికి చూపించడం జరిగింది అందులో ఆ వ్యక్తి యొక్క బట్టలు మరియు Rs.46,500 రూపాయల నగదు ఉన్నాయి. ఈ యొక్క బ్యాగును మరియు డబ్బులను బాధితుడైన లక్ష్మణ్ కు అప్పగించడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటలలోపు తన యొక్క సామాను దొరికిందని ఆనందం వ్యక్తంచేశాడు బాధితుడు . కానిస్టేబుల్ రామదాసు మరియు నిజాయితి చాటుకున్న సౌటదేవేందర్ ను అచ్చంపేట ఎస్ ఐ అభినందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *