పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై అభినందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ను ఇటీవలే చిరంజీవికీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలపారు. తాజాగా గవర్నర్ తమిళ్ సైను సతీసమేతంగా చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ను గవర్నర్ అభినందించారు. అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు.