రూ.40వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
హైదరాబాద్ బ్యూరో:
పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్(డీఎంసీ)గా విధులు నిర్వహిస్తున్న కమలశ్రీని రూ.40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్‌పీ ఆనందరావు గురువారం పట్టుకున్నారు. డీఎస్‌పీ వివరాల ప్రకారం.. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్న ధనలక్ష్మి ”రిసోర్స్ పర్సన్” పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. పోస్ట్ కావాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందిగా ధనలక్ష్మిని కమలశ్రీ డిమాండ్ చేసింది. దీంతో ఆమె ఈ నెల 6న ఏసీబీకి ఫిర్యాదు చేసింది. అంత డబ్బులు ఇవ్వలేనని మరోసారి ప్రాధేయపడగా రూ.40వేలకు ఒప్పందం కుదిరింది. గురువారం మెప్మా కార్యాలయంలో ధనలక్ష్మి నుంచి కమలశ్రీ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఖమ్మం నగర సీఐ రమణ మూర్తి, వెంకట్ ఉన్నారు……