ఏపీ అసెంబ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సాగనుంది. పలు శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందుకు ప్రవేశపెట్టనుంది. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది.