ప్రజలకు బుద్ధి చెప్పే పోలీసులే అతివేగంతో వాహనం నడపడం ఏంటని మండిపడుతున్నారు జనాలు. ప్రణతికి మెరుగైన చికిత్స అందించాలని..ఆ ఖర్చులను పోలీసులే భరించాలని డిమాండ్ చేస్తున్నారు……
యాదాద్రిలో దారుణం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన పోలీస్ వాహనం ఓ చిన్నారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పాపకు తీవ్ర గాయాలుకావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. యాదగిరిగుట్ట పాత నరసింహస్వామి ఆలయంలో దైవదర్శనం చేసుకున్న తర్వాత తండ్రితో కలిసి మూడేళ్ల ప్రణతి రోడ్డుపక్కన నిద్రపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీస్ ఇన్నోవా వాహనం అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాల పాలైన ప్రణతికి ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణతికి తల్లి లేదు. గత ఏడాది అనారోగ్యంతో మరణించింది. దాంతో ఆమె ఆలనాపాలన తండ్రి ఒక్కడే చూసుకుంటున్నాడు. మున్సిపల్ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ అంతలోనే ఈ దారుణం జరిగింది. మరోవైపు ప్రమాదంపై నిలదీసిన పాప తండ్రిని పోలీసబెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఖాకీల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు బుద్ధి చెప్పే పోలీసులే అతివేగంతో వాహనం నడపడం ఏంటని మండిపడుతున్నారు జనాలు. ప్రణతికి మెరుగైన చికిత్స అందించాలని..ఆ ఖర్చులను పోలీసులే భరించాలని డిమాండ్ చేస్తున్నారు.