వర్సిటీ సమస్యలను సీఎం పరిష్కరిస్తారు: కోదండరాం..

యూనివర్సిటీల్లో సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ రెడ్డి సుముఖంగా ఉన్నారని ప్రొ.కోదండరాం అన్నారు. ఓయూలోని దూరవిద్య కేంద్రం సెమినార్‌ హాల్‌లో శుక్రవారం తెలంగాణ వర్సిటీల ఆచార్యుల సంఘం (టౌటా) నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో వీలైనంత త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *