ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజున ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అసెంబ్లీని మూడురోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే 6వ తేదీన మంగళవారం కావడంతో.. 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు