సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్‌పైనే అందరి దృష్టి నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1న) పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో రైతులు, వాహనదారులు, వేతన జీవులకు శుభవార్తలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
ఈ బడ్జెట్లో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, సూర్యోదయ యోజన పథకాల లబ్దిదారులకు మరింతగా ఆర్థిక ప్రయోజనాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే, పన్నులు, చమురు ధరలు, వంట గ్యాస్ ధరలు కూడా తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్యోజన కింద రైతులకు ఏటా రూ.6000 అందిస్తున్నారు. అయితే రైతులకు అందించే ఈ లబ్ధిని 50 శాతం మేర పెంచి, ఏడాదికి రూ.9,000 అందించాలని మోడీ సర్కార్ భావిస్తోందని సమాచారం.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్యోజన కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల బీమా కవరేజీని అందిస్తోంది. అయితే దీన్ని రూ.10 లక్షల వరకు పెంచుతూ బడ్జెట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ.10 లక్షల పరిమితి మేరకు వైద్య సేవలు పొందడానికి వీలవుతుంది. ఇక, పెట్రోల్ ధరలు కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వేతన జీవులు ఈ బడ్జెట్‌పై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వారికి ఊరట ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపన్ను చట్టం 1961 సెక్షన్80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై, వైద్య ఖర్చులపై ట్యాక్స్డిడక్షన్క్లెయిమ్ చేసుకోవచ్చు. సాధారణంగా 60 ఏళ్లలోపు వాళ్లు రూ.25 వేల వరకు, సీనియర్ సిటిజన్లు రూ.50 వేల వరకు ఈ ట్యాక్స్డిడక్షన్ కెయిమ్ చేసుకోవచ్చు. హెల్త్ చెకప్స్ కోసం రూ.5 వేల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అయితే, నేడు ఇన్సూరెన్స్ప్రీమియంలు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్లో సెక్షన్ 80డీ కింద చేసుకునే హెల్త్ క్లెయిమ్పరిమితిని పెంచవచ్చని, పైగా అదనపు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కల్పించవచ్చని సమాచారం. సేవింగ్స్, పెన్షన్స్కీమ్స్కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ అకౌంట్హోల్డర్లకు, నేషనల్ పెన్షన్ స్కీమ్ఖాతాదారులకు కూడా పన్ను మినహాయింపులు కల్పించవచ్చని తెలుస్తోంది. ఇవే జరిగితే ఉద్యోగులు, మద్యతరగతి ప్రజలకు భారీ కలిగించినట్లే అవుతుంది. దీంతోపాటు పరిశ్రమలు, ఉత్పత్తులపై ఎలాంటి వెసులుబాటులు ఉంటాయనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.