వైసీపీ ఐదో జాబితా విడుదల..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జీలతో ఐదో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. తాజాగా, ఏడుగురితో ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

 

మరోవైపు, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంఛార్జీల మార్పులను ప్రకటించారు.

 

ఐదో జాబితా ఇంఛార్జీలు:

 

అరుకు వేలీ (ఎస్టీ): రేగం మత్స్య లింగం కాకినాడ (ఎంపీ): చలమలశెట్టి సునీల్ మచిలీపట్నం (ఎంపీ): సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ: డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు నర్సారావుపేట (ఎంపీ): పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సత్యవేడు (ఎస్సీ): నూకతోటి రాజేష్ తిరుపతి (ఎస్సీ) పార్లమెంట్: మద్దిల గురుమూర్తి.

 

కాగా, ఐదో జాబితాలో మూడు కొత్త పేర్లు వచ్చాయి. నూకతోటి రాజేష్, మత్స్యలింగం, డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు వీరిలో ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో రెండోసారి మార్పు జరిగింది. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంకు అవకాశం దక్కింది. మాధవికి అరకులో వచ్చిన వ్యతిరేకతతో హైకమాండ్ వెనక్కి తగ్గింది. ఇక ఆదిమూలం పార్టీ ఫిరాయింపుతో పాత స్థానానికి గురుమూర్తిని నియమించారు. అనేక తర్జనభర్జనల తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *