తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలు నుంచి శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలిస్తున్నారు. అంతకుముందు మాజీ డైరెక్టర్‌కు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.