‘హనుమాన్’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హిట్ సక్సెస్ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ‘జై హనుమాన్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘జై హనుమాన్లో హనుమంతుడి పాత్రలో చిరంజీవిని చూసే అవకాశం ఉంది. ఆయన్ని కలిసి మాట్లాడాలి. రాముడి పాత్ర కోసం మహేశ్ బాబును అనుకుంటున్నాను. రాముడిలా ఆయన ఎలా ఉంటారో గ్రాఫిక్స్ కూడా చేసి చూసుకున్నాం. కానీ చూడాలి ఏం జరుగుతుందో’ అని చెప్పుకొచ్చారు