ఏపీ ఎన్నికలపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్రర్స్ అస్సోసియేషన్ సర్వే.. అధికారం టీడీపీదే!


ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రక్రియ ముగిసి దాదాపు 40 రోజుల కావొస్తుండటంతో.. ఎగ్జిట్ పోల్స్ పట్ల ఆసక్తి నెలకుంది.ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అస్సోసియేషన్ సర్వే లో టిడిపి నాయకుడు చంద్రబాబు మరోసారి రాష్ట్రాన్ని పాలించే కుర్చీలో కూర్చోబోతున్నారని అస్సోసియేషన్ చైర్మన్ వి .సుధాకర్ వెల్లడించారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెరాస దే విజయమని 2017 లోనే వెల్లడించమని తెలిపారు . ఈ సార్ హాట్ హాట్ గ మారిన ఎపి ఎన్నికలు పోటా పోటీగా జరిగినప్పటికీ కేవలం కొద్దిపాటి తేడాతోనే వైసిపి ప్రతిపక్షం లో కూర్చోబోతుందని అన్నారు . ఏ పార్టీకి సంబంధం లేకుండా నిర్వహించిన సర్వే ఇది అని సుధాకర్ అన్నారు. ప్రతిపక్ష వైసిపి పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని . త్రిముఖ పోరులో టీడీపీ, వైస్సార్ సిపి 2014 కంటే ఓట్ల శాతం తగ్గిందన్నారు. 2017 లో వైసిపి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి పార్టీ అంతర్గత విషయాల్లో జాగ్రత్తపడాలని ట్విట్టర్ ద్వారా తెలిపామని , పార్టీ వీడి కొందరు వెళ్ళిపోతారని , పార్టీ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోలేదని , అది కూడా కొంత పార్టీకి బలహీనం చేకూర్చిందని పేర్కొన్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 104 – 110 కి అటు ఇటుగా వస్తాయని అస్సోసియేషన్ సర్వే అంచనా . ప్రతిపక్ష వైసిపి జగన్ పార్టీకి అటు ఇటుగా 69 – 71 సీట్లు వస్తాయని . ఇతరులు 3 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకుంటారని తెలిపారు . టీడీపీకి 40 నుంచి 42 శాతం ఓట్లు రానుండగా.. వైఎస్ఆర్సీపీకి 39-41 శాతం ఓట్లు వస్తాయని, జనసేనకు 12 శాతానికి అటు ఇటుగా ఓట్లు పడే అవకాశం ఉందని అసోసియేషన్ సర్వే అభిప్రాయపడింది. పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే.. టీడీపీకి రెండు అటు ఇటుగా 16 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి రెండు సీట్లు అటు ఇటుగా 11 స్థానాలు, ఇతరులకు 0-1 సీట్లు లేదా రాకపోవచ్చు. యువత ఎక్కువగా పవన్ కళ్యాణ్, జగన్‌కు ఓటేశారు . ఈ సారి టిడిపి కి మహిళా వోటింగ్ కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు . జనసేన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం వల్ల ఓటు బ్యాంక్ కొంత టిడిపి , కొంత వైసిపి నుండి చీలినప్పటికీ ఇరు పార్టీలు అంటే టిడిపి , వైసిపి కిందిస్థాయి నాయకుల లోపం వలన , లేదా వారి తప్పిదాల వలన , లేదా కిందిస్థాయి భూ దందాలా వలన, కార్యకర్తలు కావొచ్చు లేదా పార్టీ అభిమానులు కావొచ్చు రెండు పార్టీలలోకి వలసలు జరిగాయి . కానీ పెద్ద వలసలేమి కాదు కానీ బాలెన్సింగ్ అయింది. వలసలు జరిగినప్పటికీ మహిళా వోటింగ్ కొంత టిడిపికి పడడం వలన వైసిపి కి వోటింగ్ శాతం తగ్గింది . ఏదిఏమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం టిడిపి కి గట్టి పోటీ ఇచ్చారనే చెప్పుకోవచ్చు . ఈ సారి చంద్రబాబు కుర్చీ లో కూర్చున్నాక పాలనా విధానం లో కొంత మార్పు తీసుకు రావలి , అది గనక జరిగితే రానున్న పది సంత్సరాల వరకు తానే సియం గా ఉండే అవకాశాలు ఉన్నాయి . లేదా 2024 లో జగన్ మోహన్ రెడ్డి సియం ఖాయం .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *