తెలంగాణలో ఇండియన్ నేవీకి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో 1,174 హెక్టార్ల భూమిని నేవీకి అటవీశాఖ అప్పగించింది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు దీనిని ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే ఇది రెండోది కాగా, మొదటిది తమిళనాడులో ఉంది. కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం సీఎం రేవంత్ ను కలిశారు.