అనుకున్నదే జరిగింది మొత్తానికైతే కరీంనగర్ గడ్డపై టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన బిజెపి
రెండు క్షణాల ఆవేశం టీఆర్ఎస్ కు కరీంనగర్ ఎంపీ స్థానం తగిన సమాధానం చెప్పింది సిఎం కెసిఆర్ అనాలోచితంగా మాట్లాడిన ఆ రెండు వాక్యాలు ”హిందువులా బొoదుగాల ”టీఆర్ఎస్ కొంప ముంచింది దానికి సమాధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బిజెపి భారీ మెజారిటీతో గెలుపును చేజిక్కించుకుంది ఇది వందకు వంద శాతం ప్రజల గెలుపని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి ఇకనైనా ఒక సిఎం స్థాయిలో ఉండి ఏ నాయకుడైనా ఆచి తూచి మాట్లాడాలని కళ్లకు కట్టినట్టుగా కనబడుతుంది ఇకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలలో బిజెపి నాయకులు బాణసంచా పేలుస్తూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తుతుంది తెలంగాణలో పన్నెండు సీట్లు ఖాయమంటూ వ్యాఖ్యానించిన కెసిఆర్కు తగిన గుణపాఠమే జరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాషాయం కమ్ముకుంది నాయకులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలుతున్నారు ఇకపై ఏ పార్టీ అయినా అత్యుత్సాహంతో గెలుపు స్థానాల మ్యాజిక్ ఫిగర్ అనే ఊసెత్తకుండా అంచనాలు వేయకుండా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు