ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత కొణతాల రామకృష్ణ ఇంటికి వైఎస్ షర్మిల వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈ భేటీ విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.