ఇష్టంలేని పెళ్లి చేశారని, అదనపు కట్నం తేవాలని సీతాలుకు భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రశాంత్ ప్లాన్ చేశాడు. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని కుట్ర చేశారు..
నిజామాబాద్ జిల్లా: వరకట్నం నిషేధంపై చట్టాలున్నా…కట్న పిశాచాలు చెలరేగుతూనే ఉన్నాయి. అదనపు కట్నం కోసం కోడళ్లను చిత్రవధకు గురిచేస్తున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న భార్యను చంపుకుంటున్నారు రాక్షస భర్తలు. కోడలిని కూతురిలా చూడకుండా డబ్బిచ్చే యంత్రాల్లా పరిగణిస్తున్నారు కిరాతక అత్తలు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భిణిపై భర్త, అత్త, మరిది కలిసి కిరోసిన్ పోసి నిప్పటించారు.