పెండింగ్ లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కౌన్సిల్ ప్రతినిధుల బృందం ఆయనతో సమావేశమైంది. భట్టి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్, మూసీ సుందరీకరణతో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి పెరుగుతుందని, సంపద సృష్టిస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి సహకరిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని, జీవో 50ని రద్దు చేయాలని కౌన్సిల్ బృందం కోరింది.