బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని కేటీఆర్ కలలు కంటున్నాడు. కానీ బీఆర్ఎస్కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తాం.. మీ పార్టీని 14 ముక్కలు చేస్తాం. మా సీఎం చెప్పినట్టుగా బీఆర్ఎస్ను బరాబర్ బొంద పెడతాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.