యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘సలార్-2’లో ఉన్నాడంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రశ్న చాలా మందిలో ఆసక్తిగా మారగా తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్‌గా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఇన్‌స్టాలో క్లారిటీ ఇచ్చారు. సలార్ 2లో అఖిల్ ఉన్నాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని కన్ఫర్మ్ చేశారు. దీంతో సలార్-2లో అఖిల్ లేడని నిర్ధారణ అయింది.