విజయవాడ – దుర్గగుడి ఇఒ కోటేశ్వరమ్మ వెల్లడి
విజయవాడ కనకదుర్గమ్మను సందర్శించేందుకు ఈ నెల 30న వైఎస్.జగన్‌మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తమిళనాడు డిఎంకె అధినేత స్టాలిన్, మరో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారని దుర్గగుడి ఇఒ వి.కోటేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రుల రాక నేపథ్యంలో భద్రతా, స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ కూడా ఈ నెల 29న దుర్గమ్మ దర్శనానికి వస్తారన్నారు. బుధ, గురువారాల్లో విఐపిల తాకిడి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసు అధికారులు, ఆలయ భద్రతా సిబ్బందిని సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఎల్‌టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రముఖుల రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు……