టీడీపీని ఫిక్స్ చేసేందుకు కేశినేని నాని కొత్త అస్త్రం..!!

విజయవాడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. విజయవాడలో పూర్వ వైభవం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పట్టు నిలబెట్టుకోవాలని సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరటంతో..వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీని 60 శాతం ఖాళీ చేస్తానని కేశినేని మరోసారి చెప్పుకొచ్చారు. దీంతో నాని ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

 

నాని కీలక వ్యాఖ్యలు కేశినేని నాని మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. గతంలో టీడీపీ హయాంలో సంచలనంగా మారిన కాల్ మనీ గురించి నాని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్న నేతల గురించి ఎన్నికల వేళ తెర మీదకు తీసుకురావటమే నాని లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించటం ద్వారా న పైన ఆరోపణలు చేస్తున్న వారిని డామేజ్ చేయాలనేది నాని వ్యూహంగా స్పష్టమవుతోంది. కాల్‌ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల విలువైన డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్‌ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు.

 

ఎంపీగా బరిలోకి ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్‌ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు.రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్‌సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ పిలుపుతో వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు.రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్‌.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్‌ మనీ కార్యకలా పాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు.

 

కొత్త వ్యూహాలతో టీడీపీ నుంచి కేశినేని చిన్ని విజయవాడ లోక్ సభ అభ్యర్దిగా పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. బీజేపీతో పొత్తు ఖాయమైతే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలో నిలుస్తారని చెబుతున్నారు. బీజేపీ తో పొత్తు పైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కేశినేని నానికి ఎన్ని ఓట్లు దక్కే అవకాశం ఉంది.. టీడీపీ నుంచి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దాని పైన ఇప్పటికే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని ఈ సారి వైసీపీ ఎంపీగా బరిలో ఉండటంతో విజయవాడ ఫలితం పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వైసీపీలో చేరుతారని నాని చెబుతుండటంతో..ఏం జరుగుతుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *