అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరిక సందేశం పంపాడు. ప్రాణప్రతిష్ట జరిగే రోజు విధ్వంసం సృష్టిస్తామని, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని హెచ్చరించాడు. కాగా, ఇటీవల యూపీ పోలీసులు ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.