అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు తిరుమల క్షేత్రం నుండి లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. ఈ లడ్డులను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయించిందని ఆయన తెలిపారు