సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు ఎక్కువ. దావోస్‌లో రేవంత్‌రెడ్డి వివిధ వేదికలపై మాట్లాడారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలని, పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్‌కు రావాలని రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా ఆహ్వానించారు.