జీవితంలో తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని, అదే తాను చేసిన పెద్ద తప్పు అని స్టార్ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ‘నా ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే గతంలో నా జీవిత భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయం నుంచి విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’ అని సమంత పేర్కొంది.