వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా కష్టం: హీరో జీవా..

తమిళ నటుడు జీవా నటించిన తాజా చిత్రం ‘యాత్ర 2’. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవా ‘యాత్ర 2’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవా మాట్లాడుతూ..‘యాత్ర 2 ఆఫర్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచించా. జగన్ ప్రభావవంతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పాత్రలో నటించడం చాలా కష్టం.’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *