పొలీసులమని బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఇద్దరు సూడోలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్



పొలీసులమని బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఇద్దరు సూడో యువకులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ మరియు వన్ టౌన్ పోలీసులు 
గన్నేరువరం మండలం హన్మాజీపల్లె గ్రామానికి చెందిన కాడే అజయ్ మరియు అనిల్ అనే ఇద్దరు యువకులు బాల్యస్నేహితులు . వీరిద్దరూ కలిసి కరీంనగర్ పట్టణం లో ఒక గదిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. అజయ్ అనే యువకుడు చదువును మద్యలోనే ఆపేసి చెడు తిరుగులకు అలవాటుపడినాడు. అనిల్ స్వతహాగా ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. వీరు కరీంనగర్ లోని లక్ష్మినగర్ ప్రాంతంలో నివసిస్తున్న మండలేముల శ్రీనివాస్ శర్మ అనే పూజారికు తేది : 07.05.2019 ఫోన్ చేసి మీ మీద కేసు నమోదు చేస్తున్నాం , మీరు ప్రజలకు పూజల పేరుతొ బెదిరిస్తున్నారు అని మాకు సమాచారం వచ్చింది , కావున మెము కేసు నమోదు చేస్తున్నామని భయబ్రాంతులకు గురిచేయడం జరిగింది .ఒక వేళ మీరు కనుక ఇరవై ఐదు వేల రూపాయలను కనుక ఇస్తే మీ పైన కేసు నమోదు కాకుండా కాపాడుతామని అజయ్ చెప్పడంతో పూజారి బయపడి వారికీ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ప్రాంతంలో వారు అడిగిన విధంగానే డబ్బులు ఇవ్వడం జరిగింది .డబ్బులను తీసుకోవడానికి అనిల్ స్టేడియం వద్దకు వెళ్లి డబ్బులను తీసుకోవడం జరిగింది . మళ్ళి వారం రోజుల తర్వాత అనగా తేది:15.05.2019 నాడు మళ్ళీ ఫొన్ చూసి ముఫైవేళ రూపాయలను డిమాండ్ చేయడం జరిగింది .దింతో బాధితుడు కరీంనగర్ వన్ టౌన్ పోలీసు వారిని సంప్రదించగా రంగంలోకి దిగిన కరీంనగర్ వన్ టౌన్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలిస్ పేరుతో మోసం చేసిన యువకులను అరెస్టు చేసి పోలిస్ స్టేషను కు విచారణ నిమిత్తం తరలించడం జరిగింది ..
పోలిసుల పేరుతో ఫొన్ చేసి ఎవరైనా మాయమాటలు చేపినట్లైతే మోసపోవదని దగ్గరలో వున్నటువంటి పోలిస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలిస్ కమీషనర్ వి బి కమలాసన్ రెడ్డి తెలిపారు.
ఈ టాస్క్ లో కరీంనగర్ టాస్క్ ఫోర్సు ACP శ్రీ పి. శోభన్ కుమార్, సి.ఐ.లు ఎస్ .శ్రీనివాస రావు, కే.జనార్ధన్ రెడ్డి మరియు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ తులా శ్రీనివాస రావు, ఎస్ఐ ఏ.నరేష్ కుమార్ (టాస్క్ ఫోర్సు) ఏఆర్ ఎస్ ఐ. నర్సయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *