పాప్‌ సింగర్‌ జెన్నీఫర్‌పై కేసు నమోదు : 150,000 డాలర్ల నష్ట పరిహారం డిమాండ్

సినిమా : పాప్‌ సింగర్‌ జెన్నీఫర్‌ లోపెజ్‌పై మాన్హాటన్‌ ఫెడరల్‌ కోర్టులో సోమవారం కేసు నమోదైంది. ప్రముఖ న్యూయార్క్‌  ఫొటో గ్రాఫర్‌ స్టీవ్‌ సాండ్స్‌ తీసిన ఫొటోను అనుమతి లేకుండా జెన్నీ సోషల్‌ మీడియాలో ఫోస్టు చేసిందని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.  ‘గాయని‌ జెన్నీఫర్‌ లోపెజ్‌ అనుమతి లేకుండ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారని ఫొటోగ్రాఫర్‌ సాండ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ.‌ 150,000 డాలర్లనష్ట పరిహారంతో పాటు న్యాయవాది ఫీజును కూడా ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు’  అంతేగాక జెన్నీఫర్‌ సోంత నిర్మాణ సంస్థ నుయోరికాన్‌ ప్రోడక్షన్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసమే తన ఫొటోను వాడుకుందని సాండ్స్‌ పిటిషన్‌లో పేర్కొన్నట్లు చెప్పాడు. తన ఫొటోను జెన్నీ 2017 జూన్‌ 23న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారని.. దానికి ఇప్పటి వరకూ 650, 000 లైక్‌లు కూడా వచ్చినట్లు ​కూడా చెప్పాడని  రిచర్డ్‌ పేర్కొన్నాడు. అయితే దీనిపై జెన్నీఫర్‌ కానీ ఆమె న్యాయవాది కానీ ఇంత వరకూ స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *