‘ఓజీ’ లో సినిమాలో పాట పాడనున్న పవర్ స్టార్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుని బ్రేక్‌లో ఉంది. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తమన్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఒక వేళ అదే జరిగితే మళ్లీ పవన్ నోట పాట వినే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *