‘హనుమాన్ 2’లో రామ్ చరణ్..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. థియేటర్లలో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ మేరకు సీక్వెల్ ‘హనుమాన్ 2’ అప్‌డేట్ కూడా వచ్చింది. అయితే సీక్వెల్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *