“కిలకిల నవ్వింది క్లీంకార.. జగమంతా దీవించే మనసారా”.. మెగా ఫ్యాన్స్ గిప్ట్….

రామ్‌ చరణ్‌-ఉపాసనల గారాల పట్టీ క్లీంకారకు మెగా ఫ్యాన్స్ గిఫ్ట్‌ ఇచ్చారు. వారి అభిమానాన్ని పాట రూపంలో తెలియజేశారు. ఆ పాటను సంక్రాంతి సందర్భంగా ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు వైరల్ అవుతుంది. ‘కిలకిల నవ్వింది క్లీంకార.. జగమంతా దీవించే మనసారా..’ అంటూ సాగే ఆ పాటను రఘు బెల్లంకొండ రాశారు. ధనుంజయ్‌ ఆలపించారు. ‘చిన్నారి కోసం మేము అందించిన చిరు కానుక ఉపాసనకు నచ్చడం మా అదృష్టం’ అని రఘు సంతోషం వ్యక్తం చేశారు.

 

ప్రస్తుతం మెగా కుటుంబం అంతా బెంగళూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంది. చిరంజీవి – అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులందరూ కలిసి ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వాటితో పాటు ఈ పాట కూడా ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *