‘అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతాం’..

ఏపీ రాష్ట్రంలో అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు జులైలో వేతనాలు పెంచేందుకు ఓకే చెప్పారని వెల్లడించారు. అంగన్‌వాడీలు ప్రతిపాధించిన 11 డిమాండ్లలో పదింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేతనాల పెంపునకు సీఎం జగన్ సుముఖతతో ఉన్నారని తెలిపారు. అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *