సాంకేతి పరిజ్ఞానం పెరిగేకొద్ది అభివృద్ధితో పాటు మనవాలికి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మంచికోసం ఉపయోగించాల్సిన పరిజ్ఞాన్ని కొందరు తప్పుడు పనులకు వాడుకుంటున్నారు. ఇప్పడు మనం తెలుకునే విషయం కూడా ఈ కోవకు చెందిందే. ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ డీప్‌ఫేక్ వీడియో(Sachin Tendulkar Deep Fake Video) కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వీడియో గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోలో ఉంది. దీనిపై గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ స్పందిచారు. తనకు సంబంధించి ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అవుతుందని..వీడియో ఉన్నది తాను కాదని ట్విట్టర్ వేదికగా సచిన్ తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సచిన్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా ఈ మధ్యే సచిన్ కుమార్తె సారా(Sara Tendulkar) కూడా డీప్‌ఫేక్ బారిన పడింది. టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ఉన్నట్టు మార్పింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సారా తన సోదరుడు అర్జున్‌తో దిగిన ఫోటోలు మార్పింగ్ చేసి అర్జున్ స్థానంలో శుభమన్ గిల్(Shubman Gill) ఫోటోను అమర్చారు. ఇవే కాకుండా ఇంకా చాల మంది సెలబ్రెటీలు ఈ డీప్‌ఫేక్ వీడియోలను ఎదుర్కొన్నారు. ప్రధాని మోడీ, హీరోయిన్ రష్మికా మందాన, ఆలియా బట్, ఖాజోల్, వంటి ఎందరో సెలబ్రెటీలు టీప్‌ఫేక్ భారిన పడ్డారు. దీనిపై బాధిత సెలబ్రెటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.