జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్‌లను ఆపేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 4G ప్రీపెయిడ్ ప్లాన్లపైనే 5G సేవలనూ అందిస్తున్నాయి. ఇకపై 4G సేవలతో పోలిస్తే 5G కోసం 5-10శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. 5G సేవలకు చేసిన ఖర్చును రాబట్టుకోవడానికి ఈ విధానాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. ప్రస్తుత మొబైల్ టారిఫ్ ధరలను 20 శాతం పెంచే అవకాశం ఉంది.