తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సీఎం రేవంత్ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తోపాటు అధిష్ఠానం పెద్దలతో ఎమ్మెల్యేల, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు.