చిత్తూరు జిల్లా, పుంగనూరులో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి స్వగృహమునకు వెళ్లిన బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తన పెళ్లి వేద పండితులచే నిశ్చయించిన ఫిబ్రవరి14 కు హాజరుకావాలని బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారిని శాలువాతో సన్మానించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఈ తరుణంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెప్పి తప్పకుండా ఫిబ్రవరి 14 నాడు హాజరవుతానని మర్యాదపూర్వకంగా తెలియజేశారు. ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఆహ్వానం పలుకుతూ అందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.