సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మంగా భావించే అవార్డుల్లో ‘ఆస్కార్’ ఒకటి. ఈ ఏడాది నిర్వహించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. ఈ అకాడమీలో పదివేల మందికిపైగా సభ్యులు ఉండగా.. వారికి కేటాయించిన విభాగాల్లో ఓటు వేయనున్నారు. గతేడాది అకాడమీలో సభ్యత్వం పొందిన టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలి సారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.