రవిప్రకాశ్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన టీవీ9 కొత్త, పాత యాజమాన్యాలు

ప్రధానంగా టీవీ9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని రవిప్రకాశ్ చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవం అని ప్రకటించాయి. వాస్తవాలను అందరి ముందుకు తేవడానికి టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను టీవీ9 కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

Image result for ravi prakash tv 9

ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయి అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం అసత్యమైన, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. తమపై విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపాయి. కోర్టులో రవిప్రకాశ్ తరపు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖండించాయి. ఫోర్జరీ, చీటింగ్‌ కేసుల్లో తాను ఎదుర్కొంటున్న విచారణను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేశాయంటూ విమర్శించాయి.
ప్రధానంగా టీవీ9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని రవిప్రకాశ్ చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవం అని ప్రకటించాయి. వాస్తవాలను అందరి ముందుకు తేవడానికి టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను టీవీ9 కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
అయితే  ఈ ప్రకటన సారాంశం ఇలా ఉంది. “ఆగస్టు, 2018 నాటికి చింతలపాటి హోల్డింగ్స్‌, ఐల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ABCLలో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అనేది జరగలేదు. ABCLకు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లను నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లను పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో స్పష్టంగా నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం ఇచ్చాం. ఈ వ్యవహారం అంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు.







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *