ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. టీడీపీ, జనసేనలో చేరుతున్న వైసీపీ నేతల గురించి చర్చిస్తున్నారని తెలుస్తోంది.
వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరినవారికి సీట్ల కేటాయింపుపైనా బాబు, పవన్ సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు ఓ స్పష్టతకు వస్తారని సమాచారం. నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆదివారం మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోల ప్రతులను ఆ మంటల్లో వేయనున్నారు.