తెలంగాణలో రైతుబంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. కేంద్రం మంజూరు చేసిన రూ.9వేల కోట్ల రుణంలో రూ.2వేల కోట్లు ఈనెల 16న వచ్చే అవకాశం ఉంది. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తిచేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు కేవలం రూ.1000 కోట్ల వరకే ప్రభుత్వం రైతుబంధు నగదు ఖాతాల్లో జమచేసింది.