తెలంగాణ స్పీకర్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు…

High Court : విలీనం చట్ట విరుద్ధం అని కాంగ్రెస్ చెబుతుంటే… కాంగ్రెస్ చేసినప్పుడు లేదా అని రివర్స్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మరి హైకోర్టు ఏం చెప్పబోతోంది?

Image result for high court of telangana
టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో… కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చెయ్యడం… 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో కలిపేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు రెండు పిటిషన్లతో హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఒక పిటిషన్‌లో ఈ అంశంపై ఇవాళ జరగాల్సిన విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. రెండో పిటిషన్‌లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్‌తోపాటూ… టీఆర్ఎస్‌లోకి మారిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా నోటీసులు పంపింది హైకోర్టు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుముర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్, వనమా వెంకటేశ్వరరావు, సబిత, సురేందర్‌కు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇదివరకు ఈ అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన హైకోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి… ఈ విలీన ప్రక్రియను సమర్థించారు. ఈ నెల 6న అసెంబ్లీ సెక్రెటరీ జారీచేసిన బులెటిన్‌-10ని సస్పెండ్‌ చేయాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిన్న హైకోర్టుకు వెళ్లారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌ సభ్యులు అనీ… కాంగ్రె‌స్ టికెట్‌పై గెలిచారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని వివరించారు.పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన కంప్లైంట్లను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో పరిష్కరించాలనీ, అది మానేసి… విలీనాన్ని సమర్థించడం చట్ట విరుద్ధం అంటున్నారు భట్టి విక్రమార్క. ఇవాళ ఈ అంశంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతుందని అనుకున్నా, కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *